రాయచోటిటౌన్,రాయచోటి - మదనపల్లె రోడ్డులోని ఇందిరమ్మ కాలనీ వాసులు బుధవారం తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ రోడ్డెక్కారు.
రాయచోటిటౌన్,రాయచోటి - మదనపల్లె రోడ్డులోని ఇందిరమ్మ కాలనీ వాసులు బుధవారం తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ రోడ్డెక్కారు. కాలనీలోని మహిళలు, పురుషలు, పిల్లలు అంతా కలసి రోడ్డుపై బండరాళ్లను అడ్డువేసి సుమారు రెండు గంటల పాటు అటకా యించారు. దీంతో ఇరువైపులా వాహనాలు పూర్తిగా ఆగిపోయాయి.
పోలీసులు అక్కడికి వెళ్లి వారిని సర్దిచెప్పేందుకు శతవిధాలా ప్రయత్నించారు. తమకు తాగునీరు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి లేచేది లేదని తేల్చి చెప్పారు. ఇలా అనుమతి లేకుండా రోడ్డుపై బైటాయించడం సమంజసంగాలేదని, మున్సిపాల్టీ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని, అందుకు తాము కూడా సహకరిస్తామని చెప్పారు. దీంతో వారు ఆందోళన తాత్కాలికంగా విరవించుకున్నారు.