'ర్యాలీ ఫర్‌ రివర్స్‌ పేరుతో మోసం' | water man of india rajendra singh fires on cm chandrababu | Sakshi
Sakshi News home page

'ర్యాలీ ఫర్‌ రివర్స్‌ పేరుతో మోసం'

Sep 14 2017 12:07 PM | Updated on Aug 14 2018 11:26 AM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వాటర్‌మెన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ మండిపడ్డారు.

సాక్షి, అమరావతి: నదీ పరిరక్షణ చట్టానకి విరుద్ధంగా కృష్ణానది గర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్నారని వాటర్‌మెన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ మండిపడ్డారు. నదుల అనుసంధానం ప్రకృతికి విరుద్ధమైన చర్య అని, పెను విధ్వంసానికి కారణం అవుతుందని హెచ్చరించారు.

ఈషా ఫౌండేషన్‌ నేతృత్వంలో చేపట్టిన ర్యాలీలో నదుల పరిరక్షణకు ప్రతిజ్ఞ చేసిన ముఖ్యమంత్రి.. నదీ తీరంలో అక్రమ కట్టడాలను ఎందుకు ఆపడంలేదని మండిపడ్డారు. నదీ గర్భ ప్రాంతం నివాసానికి అనుకూలం కాదని, అయినా సీఎం అక్కడే నివాసం ఉండటం చట్ట విరుద్ధం అన్నారు.

ఈషా ఫౌండేషన్‌పైనా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. జగ్గీవాస్‌దేవ్‌ ఉద్యమం వెనుక కార్పొరేట్‌ రాజకీయ లబ్ధి ఉందని విమర్శించారు. ర్యాలీ ఫర్‌ రివర్స్‌ పేరుతో ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి వాటిని ఉల్లంఘించడం సరికాదని రాజేంద్రసింగ్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement