రాళ్లపాడు జలాశయానికి వరద ఉధృతి | water flow to rallapadu dam in prakasam district | Sakshi
Sakshi News home page

రాళ్లపాడు జలాశయానికి వరద ఉధృతి

Nov 30 2015 8:51 AM | Updated on Sep 3 2017 1:16 PM

ప్రకాశం జిల్లాలోని రాళ్లపాడు జలాశయం వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉంది.

ఒంగోలు : ప్రకాశం జిల్లాలోని రాళ్లపాడు జలాశయం వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉంది. అల్పపీడనం కారణంగా జిల్లాలో  కురుస్తున్న వర్షాలకు వరద నీరు భారీగా చేరడంతో ఉధృతి పెరుగుతోంది. దీంతో అధికారులు 5 గేట్లను ఎత్తి 9 వేల క్యూసెక్కుల నీటిని మన్నేరుకు విడుదల చేశారు. రాళ్లపాడు జలాశయం పూర్తి సామర్ధ్యం 20.5 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 19.6 అడుగులగా ఉంది. నీటి మట్టం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమై నీటిని విడుదల చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement