ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి

Voters Should Be Aware On Party Symbols - Sakshi

హెలికాప్టర్‌ గుర్తుతో  నష్టపరిచే ప్రయత్నం

 సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి  

సాక్షి, పొదలకూరు : ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని, హెలికాప్టర్‌ గుర్తుతో వృద్ధుల ఓట్లు వేయించుకుని వైఎస్సార్‌సీపీకి నష్టం కలిగించాలని చూస్తున్నట్టు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని బిరదవోలు, పార్లపల్లి, మర్రిపల్లి, ఇనుకుర్తి, డేగపూడి, దుగ్గుంట పంచాయతీ గ్రామాల్లో ఎమ్మెల్యే శనివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ సోమిరెడ్డి ప్రజాశాంతి పార్టీకి కేటాయించిన హెలికాఫ్టర్‌ గుర్తుపై ఓ యువకుడిని అభ్యర్థిగా నిలబెట్టి తన వద్ద ఉంచుకుని కొద్దొగొప్పొ వైఎస్సార్‌సీపీ ఓట్లను నష్టపరచాలని చూస్తున్నట్టు ఆరోపించారు.

అయితే ఫ్యాను గుర్తుతో పాటు తన ఫొటో, ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌రావు ఫొటోలు ఉంటాయన్నారు. ఇందువల్ల తేలిగ్గా గుర్తించి ఓటు వేసే అవకాశం ఉందన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నైనా గెలివాలని చూస్తున్నట్టు తెలిపారు. అయితే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు సోమిరెడ్డిని నాలుగో సారి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నట్టు విమర్శించారు. జగన్‌ సీఎం కావడం ఖామని, ఐదేళ్లలో పదేళ్ల అభివద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

మెట్టప్రాంతమైన బిరదవోలు, ఇనుకుర్తి, మర్రిపల్లి పంచాయతీ గ్రామాలకు సాగునీటిని అందించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో రావుల చినఅంకయ్య, ఇంద్రసేనగౌడ్, అమర్‌నాథ్‌గౌడ్, వెన్నపూస దయకర్‌రెడ్డి లక్ష్మణ్‌రెడ్డి, శ్రీరాములు, లక్ష్మయ్య, పోసిన చినఅబ్బయ్య, కాకు నర్సారెడ్డి, ఎన్‌.గోపాల్‌నాయుడు, నీలి పెంచలయ్య, కోసూరు సుబ్రహ్మణ్యం, గోగుల గోపాలయ్య, అక్కెం రాఘవరెడ్డి, కైతేపల్లి సుబ్బయ్య, ఎస్‌.సుబ్బయ్య, అక్కెం రామకోటారెడ్డి, గార్ల పెంచలయ్య, జి.ఈశ్వర్‌రెడ్డి, రామలింగారెడ్డి, కె.నారాయణరెడ్డి, కల్యాణ్‌రాజు, కేతు రామిరెడ్డి, సుందరామయ్య, మోహన్‌రాజు, బాలకోటి, జయరామయ్య తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో చేరిక
ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో పలుగ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. బిరదవోలులో మాజీ సర్పంచ్‌ భర్త రావుల వెంకటనారాయణ, కైతేపల్లి మస్తానయ్య, చిడదల మస్తానయ్యలు వేర్వేరుగా మొత్తం 30 కుటుంబాల వారు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. ప్రభగిరిపట్నం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గోగుల చిన్నయ్య ఆధ్వర్యంలో గోగుల మస్తానయ్య, కాకు గోపాల్, దేవరాల నాగరాజు, కాకు హనుమయ్య తదితరులు 20 కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.
     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top