రోడ్‌ షోలో డబ్బులు పంచిన బాలకృష్ణ | Vote for Note in Nandyal by election, TDP MLA Balakrishna distributes money in road show | Sakshi
Sakshi News home page

రోడ్‌ షోలో డబ్బులు పంచిన బాలకృష్ణ

Aug 17 2017 11:09 AM | Updated on Aug 10 2018 7:19 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నంద్యాల ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్‌ షోలో డబ్బులు పంచారు.


సాక్షి, నంద్యాల: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నంద్యాల ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్‌ షోలో డబ్బులు పంచారు. బాలకృష్ణ డబ్బులు పంపిణీ చేస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ప్రభుత్వ కార్యక్రమాలను రోడ్‌ షోలో ఏకరువు పెట్టిన బాలకృష్ణ.. అభివృద్ధి కోసం టీడీపీకి ఓటెయ్యాలని నంద్యాల ప్రజలను కోరి.. మళ్లీ అదే వాహనం మీది నుంచి వారికి డబ్బులు పంచడం విస్మయానికి గురి చేస్తోంది.

బాలకృష్ణ డబ్బులు పంచుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ రోడ్‌ షోలో మాట్లాడుతున్నారు. కాగా, బాలకృష్ణ డబ్బులు పంపిణీ వ్యవహారం ఎన్నికల కమిషన్‌(ఈసీ) దృష్టికి వెళ్లింది. సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలను ఈసీ, పలువురు ముఖ్య అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కాగా, రోడ్‌ షో అనంతరం ఓ హోటల్లో బస చేయడానికి వెళ్లిన బాలకృష్ణ.. అక్కడికి ఫొటో దిగేందుకు వచ్చిన ఓ అభిమానిపై చేయి చేసుకున్న విషయం తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement