‘బాబు దుబారాకు ప్రజావేదిక ఓ నమూనా’

Vijayasaireddy Slams Chandrababu Over Praja Vedika - Sakshi

సాక్షి, అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజావేదిక పేరుతో ప్రజాధనాన్ని దుబారా చేసిన తీరును వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి ఎండగట్టారు. కోటి రూపాయలు ఖర్చేయ్యే ప్రజావేదిక తాత్కాలిక నిర్మాణానికి రూ. 9 కోట్లు వెచ్చించినట్టు చూపడంపై విస్మయం వ్యక్తం చేశారు. ప్రజా వేదిక అనే రేకుల షెడ్డు నిర్మాణంలో సిమెంటు కంటే సినిమా సెట్టింగ్‌ల్లో వాడే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌నే ఎక్కువగా వాడినట్టు కనిపిస్తోందని ఆయన ట్వీట్‌ చేశారు.

చంద్రబాబు హయాంలో జరిగిన నిర్మాణాలన్నీ ఇలానే ఉంటాయని, ఇది అందుకు ఓ చిన్న నమూనానే అన్నారు. ఇక ప్రజావేదిక షెడ్డు కూల్చివేతను చూసేందుకు వచ్చిన ప్రజలకు ఉన్న అవగాహన కూడా టీడీపీ నేతలకు లేకపోవడం దురదృష్టకరమని దుయ్యబట్టారు. రైతుల నుంచి సేకరించిన 33 వేల ఎకరాల్లోనే ప్రజావేదికను నిర్మించి ఉంటే ఇవాళ పెద్దమొత్తంలో ప్రజాధనం వృధా అయ్యేది కాదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. (చదవండి: భారీ భద్రత నడుమ కొనసాగుతున్న ప్రజావేదిక తొలగింపు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top