పోలీసులకు విజయసాయిరెడ్డి ఫిర్యాదు | Vijayasai Reddy Warning To Fake Social Media Account Holders | Sakshi
Sakshi News home page

‘వారు ఎక్కడున్నా పోలీసుల వలకు చిక్కక తప్పడు’

May 10 2020 2:16 PM | Updated on May 10 2020 2:45 PM

Vijayasai Reddy Warning To Fake Social Media Account Holders - Sakshi

సాక్షి, విజయవాడ : సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లతో తనపై అసభ్య పదజాలంతో సాగిస్తున్న దుష్ర్పచారంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు  ఆదివారం ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్ట, గౌరవ, మర్యాదలకు భంగం కలిగించేలా తన పేరుతో కొందరు సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాంటి వారి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫేక్‌గ్యాంగ్‌పై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారణ మొదలెట్టారని, సైబర్ క్రైమ్ చట్టం నుండి నిందితులు ఎవరూ కూడా తప్పించుకోలేరని అభిప్రాయపడ్డారు.

ఫేక్‌ గ్యాంగ్‌ పోస్టులను అత్యుత్సాహంతో షేర్‌ చేసుకునే వాళ్లు సైతం సైబర్‌ క్రైమ్‌ చట్టం కిద్ద శిక్షార్హులేనని చెప్పారు. అలాంటి వారు ప్రపంచంలో ఎక్కడున్నా.. ఏ రాష్ట్రంలో ఉన్నా సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వలకు చిక్కక తప్పదన్నారు. కాబట్టి తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు, ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో అసభ్య, ఫేక్‌ పోస్టులు పెట్టే వారితో పాటు వాటిని అత్యుత్సాహంతో సర్క్యులేట్ చేసే వారిని కూడా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విడిచి పెట్టరని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement