వైభవంగా దసరా సంబరాలు | vijaya dashami grand celebration in mahabubnagar district | Sakshi
Sakshi News home page

వైభవంగా దసరా సంబరాలు

Oct 14 2013 2:56 AM | Updated on Oct 8 2018 5:04 PM

గత తొమ్మిది రోజులుగా దుర్గామాతను వివిధ రూపాల్లో దర్శించి తరిం చిన ప్రజలు ఆదివారం అచ్చంపేట, కల్వకుర్తి, మక్తల్, గద్వాల, అలంపూర్, జడ్చర్ల, షాద్‌నగర్, కొడంగల్, నా రాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో దసరా పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.

మహబూబ్‌నగర్ కల్చరల్, న్యూస్‌లైన్: గత తొమ్మిది రోజులుగా దుర్గామాతను వివిధ రూపాల్లో దర్శించి తరిం చిన ప్రజలు ఆదివారం  అచ్చంపేట, కల్వకుర్తి, మక్తల్, గద్వాల, అలంపూర్, జడ్చర్ల, షాద్‌నగర్, కొడంగల్, నా రాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో  దసరా పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. నవమి, దశమి ఒకేరోజు వచ్చినప్పటికీ ఆదివారమే విజ యదశమిని జరుపుకోవాలని నిర్ణయించడంతో ఉద యం నుంచే పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి.
 
 పై-లీన్ ప్రభావంతో భారీవర్షాలు కురుస్తాయన్న సమాచారం కొంత కలవరపెట్టినప్పటికీ వాతావరణం అనుకూలించడంతో పాలమూరు పట్టణప్రజలు దసరా ధ్వజం ఊరేగింపులో భారీసంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక దసరాఉత్సవ కమిటీ, ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో బ్రాహ్మణవాడిలోని మందిరంలో ఉదయం 8గంటలకు దేవయజ్ఞం, వే దోపదేశం నిర్విహ ంచారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రా రంభమైన ఊరేగింపులో గౌలి వెంకటేశ్ నాయకత్వంలో రాయిచూర్‌నుంచి వచ్చిన సుమారు 100మంది గౌలి సమాజం ప్రతినిధులు, హనుమాన్ వ్యాయామశాల నిర్వాహకులు వివిధ దేవతల వేషధారణ, కోలాట ప్రదర్శనలు నిర్వహించారు. ధ్వజధారిగా న్యాయవాది వి.మనోహర్‌రెడ్డి వ్యవహరించారు. 3 గంటలకు రాంమందిర్ చౌరస్తాలో ఉన్న దసరాకట్ట దగ్గర జనసమ్మేళనాన్ని నిర్వహించి ధ్వజారోహణం చేశారు.

అక్కడి నుంచి బయలుదేరిన ర్యాలీ పాన్‌చౌరస్తా, క్లాక్‌టవర్, అశోక్‌టాకీస్ చౌరస్తా, అంబేద్కర్ విగ్రహం ద్వారా జిల్లా పరిషత్ క్రీడామైదానానికి చేరింది. వే లాది మంది పాల్గొన్న బహిరంగసభలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించిన అనంతరం పర్వదిన ప్రాముఖ్యతను వారణాసిలోని స్యాతక పాణిని కన్యాగురుకులం ఉపన్యాసకురాలు రావికంటి జ్యోతిశ్రీ సందేశమిచ్చారు. నవరాత్రులకు చిహ్నంగా బెలూన్‌ల ద్వారా ఆకాశంలోకి పంపిన 9 రకాల జ్యోతులు అలరించాయి. తదుపరి టంగుటూరు నుంచి వచ్చిన హరనాథ్ బృందం వివిధ రంగులు, ఆకృతుల్లో పేల్చిన బాణాసంచా ముచ్చట గొలిపింది. అనంతరం రావణాసుర దహన ప్రక్రియను పూర్తిచేశారు.
 
 విజయానికి స్ఫూర్తి దసరా  
 చెడుపై మంచి, అధర్మంపై ధర్మం, అన్యాయంపై న్యాయం గెలుస్తుందని ఈ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ ఎం. గిరిజాశంకర్, ఎస్పీ నాగేంద్రకుమార్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ విఠల్‌రావు, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ తదితరులు తమ సందేశాల్లో వెల్లడించారు. విజయానికి స్ఫూర్తిగా నవరాత్రులు, విజయదశమి వేడుకలు నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో ఏజీసీ డాక్టర్ రాజారాం, ట్రైనీ కలెక్టర్ విజయరామరాజు, ఆర్టీఓ హన్మంత్‌రావు, డీసీసీ అధ్యక్షుడు కొత్వాల్, మునిసిపల్ మాజీ చైర్మన్ సహదేవ్‌యాదవ్, ఉత్సవ కమిటీ ప్రతినిధులు డాక్టర్ మురళీధర్‌రావు, ముత్యాల ప్రకాశ్, కేఎస్ రవికుమార్, చంద్రయ్య, సత్తూరు రాములుగౌడ్, గోపాల్ యాదవ్, చంద్రకుమార్ గౌడ్, పులి అంజనమ్మతోపాటు పట్టణ ప్రముఖులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement