కృష్ణ జిల్లా నందిగామలో విజిలెన్స్ అధికారులు శనివారం సాయంత్రం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు.
కృష్ణ జిల్లా నందిగామలో విజిలెన్స్ అధికారులు శనివారం సాయంత్రం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. కందిపప్పును నిల్వ ఉంచి కృత్రిమ కొరతను సృష్టిస్తున్న వారిని గుర్తించడమే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అక్రమంగా కందిపప్పు బ్లాక్ చేసిన ఒక వ్యాపారిని అరెస్టు చేశారు. కందిపప్పును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.