ఆ సంఘటన గుర్తొచ్చింది : వాసిరెడ్డి పద్మ

Vasireddy Padma Defended the Accused Encounter in the Disha Case - Sakshi

సాక్షి, అమరావతి : దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం ద్వారా బాధితురాలి ఆత్మ శాంతిస్తుందని మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. దిశకు సత్వర న్యాయం జరిగిందంటూ దోషులకు పడిన శిక్షను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ఈ ఎన్‌కౌంటర్‌తో వైఎస్సార్‌ హయాంలో జరిగిన సంఘటన మరొకసారి గుర్తుకు వచ్చిందని వెల్లడించారు. స్త్రీలపై జరుగుతున్న పాశవిక దాడులకు ప్రతిగా ఈ ఎన్‌కౌంటర్‌ కనువిప్పు కావాలని ఆకాంక్షించారు. నిందితులకు పడిన శిక్ష పట్ల దేశ ప్రజలు హర్షిస్తున్నారనీ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చట్టాల్లో మార్పు రావాలని వివరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top