'విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలి' | Vasireddy Padma Attended Childrens Convention Seminar In Visakapatnam | Sakshi
Sakshi News home page

'విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలి'

Published Wed, Feb 5 2020 5:02 PM | Last Updated on Wed, Feb 5 2020 5:26 PM

Vasireddy Padma Attended Childrens Convention Seminar In Visakapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖ బీచ్ రోడ్ యూత్ హాస్టల్ సమావేశ మందిరంలో నేచర్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బాలల సమాలోచన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అసెంబ్లీ లేజిస్లేటివ్ కమిటీ స్త్రీ, శిశు సంక్షమ వ్యవహారాలు చైర్మన్ విశ్వాసరాయి కళావతి, రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జి.హైమవతి తదితరులు పాల్గొన్నారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉందని, అందుకు అనుగుణంగానే ప్రభుత్వం మార్పులు తీసుకువస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం బోధన ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. విద్య, బాలల సంక్షేమం కోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేస్తున్న కృషికి బాలల హక్కుల పోరాట నేత కైలాష్‌ నాథ్ చటర్జీ జగన్‌ను కలిసి ప్రశంసించారని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.

సుస్థిర లక్ష్యాల సాధన కోసం బాలల సమాలోచన సదస్సు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని శిశు సంక్షమ వ్యవహారాలు చైర్మన్ విశ్వాసరాయి కళావతి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకం బాలల చదువు కోసమేనని, సమాజంలో పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి పాఠశాలలో బాలలకు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహిస్తోందని, ఆదీవాసీల సంక్షేమం కోసం ప్రభుత్వం  త్వరలోనే భాషా వలంటీర్లను నియమించనుందని కళావతి పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement