నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో ఒకపక్క సతమతమవుతున్న ప్రజలపై పక్షం రోజుల్లో రెండోసారి పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి మోయలేని భారం పెంచడం దారుణమని వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
వైఎస్సార్‌సీపీ నేత వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో ఒకపక్క సతమతమవుతున్న ప్రజలపై పక్షం రోజుల్లో రెండోసారి పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి మోయలేని భారం పెంచడం దారుణమని వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. చమురు కంపెనీలు పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
రాహుల్‌కు కనువిప్పు కలిగిందా
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించాలన్న కనువిప్పు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఇపుడు కలిగిందా అని పద్మ ప్రశ్నించారు. వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక తనువు చాలించిన వందలాది కుటుంబాలను తమ అధినేత జగన్ పరామర్శిస్తానంటే వద్దంటూ.. అందరినీ ఒక చోట చేర్చి పరిహారం ఇవ్వాలని సూచించిన రాహుల్.. ఇపుడు ఇంటింటికీ ఎందుకు తిరుగుతున్నారని విమర్శించారు. చేసిన తప్పును రాహుల్ దిద్దుకుంటున్నారనుకోవాలా? లేక జగన్ యాత్రను ఆదర్శంగా తీసుకున్నారా అని పద్మ ప్రశ్నించారు.