గుంటూరు రూరల్ మండలం దౌడవరం గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు శనివారం గుర్తించారు.
గుంటూరు : గుంటూరు రూరల్ మండలం దౌడవరం గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. వారు అందించిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహన్ని పరిశీలించారు.
నిందితులు ఆమెను అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఇది జరిగి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.