పర్మిషన్‌ లేకుండా లే అవుట్‌ వేస్తే తప్పేంటి...? | Unauthorized lay-out of former TDP MLA Bode Prasad | Sakshi
Sakshi News home page

పర్మిషన్‌ లేకుండా లే అవుట్‌ వేస్తే తప్పేంటి...?

Aug 6 2019 4:34 PM | Updated on Aug 6 2019 5:04 PM

 Unauthorized lay-out of  former TDP MLA Bode Prasad  - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: అనుమతులు లేకుండా వేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు చెందిన  అక్రమ లే అవుట్‌ను అధికారులు ధ్వంసం చేశారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం గొల్లగూడెం గ్రామంలో కనీసం పంచాయతీ అనుమతులు కూడా తీసుకోకుండా లే అవుట్‌ వేసినట్లు అధికారులు తెలిపారు. అనధికార లే అవుట్‌పై బోడె ప్రసాద్‌ను అధికారులు ప్రశ్నించగా.. ఇక్కడ కొన్ని స్థలాలు అనుమతులు లేకుండానే ఉన్నాయని.. పర్మిషన్‌ లేకుండా వేస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. మహిళ అధికారి అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారు. నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement