రెండు ఇసుక లారీలు ఢీ | two trucks are collide | Sakshi
Sakshi News home page

రెండు ఇసుక లారీలు ఢీ

Nov 4 2013 1:56 AM | Updated on Sep 2 2017 12:15 AM

మండలంలోని బావురావుపేట గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున ముందు వెళ్తున్న ఇసుక లారీని మరో ఇసుక లారీ వెనుక నుంచి ఢీకొట్టింది.

చెన్నూర్ రూరల్, న్యూస్‌లైన్ :  మండలంలోని బావురావుపేట గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున ముందు వెళ్తున్న ఇసుక లారీని మరో ఇసుక లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ సంఘటనలో వెనక లారీలో ఉన్న డ్రైవర్‌కు తీవ్ర గాయూలయ్యూరుు. పోలీసుల కథనం ప్రకారం.. అక్కెపల్లి ఇసుక క్వారీ నుంచి ఇసుక లోడ్లతో లారీలు బయల్దేరారుు. బావురావుపేట గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గుంతలు ఉండటంతో ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ బ్రేక్ వేసి వాహన వేగాన్ని తగ్గించాడు. వెనకాలే వస్తున్న మరో ఇసుక లారీ డ్రైవర్ గమనించలేదు. వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టాడు. వెనక లారీలో ఉన్న  క్లీనర్ దూకడంతో అతడికి గాయూలేమికాలేదు. డ్రైవర్ కొప్పుల రవీందర్‌రెడ్డి వాహనంలో ఇరుక్కుపోయూడు. గమనించి ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపేసి వాహనంలో ఇరుక్కుపోరుున రవీందర్‌రెడ్డిని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు.

అతడిని 108లో చెన్నూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం అతడి స్వగ్రామమైన వరంగల్ ఆస్పత్రికి తరలించారు. ఢీకొట్టిన లారీ ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. వేగంగా వచ్చి లారీని వెనక నుంచి ఢీకొట్టి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ రవీందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఖయ్యూం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement