సాక్షి టీవీ ఫోటోగ్రాఫర్పై దాడి | TV Journalist attacked by TDP and Congress Party supporters in Krishna district | Sakshi
Sakshi News home page

సాక్షి టీవీ ఫోటోగ్రాఫర్పై దాడి

May 7 2014 4:51 PM | Updated on Mar 18 2019 7:55 PM

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పాలపర్రులో పోలీంగ్ బూత్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పాలపర్రులో పోలీంగ్ బూత్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీంగ్ బూత్ సమీపంలో టీడీపీ - కాంగ్రెస్ పార్టీలకు చెందిన వర్గీయుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అది కాస్త ఘర్షణగా మారింది. ఆ దృశ్యాలను అక్కడే ఉన్న సాక్షి టీవీ ఫోటోగ్రాఫర్ చిత్రీకరిస్తున్నారు. దాంతో ఆగ్రహించిన ఇరుపార్టీల కార్యకర్తలు సాక్షి టీవీ ఫోటోగ్రాఫర్పై దాడికి దిగారు.

 

ఘర్షణ దృశ్యాలు చిత్రీకరిస్తావా అంటూ కెమెరాను ధ్వంసం చేసి... ఫోటోగ్రాఫర్పై దాడి చేశారు. దాంతో సాక్షి ఫోటోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement