చోరీ చేసిందంటూ చిన్నారిని చితకబాదిన ట్యూటర్ | Tutor beats student brutally | Sakshi
Sakshi News home page

చోరీ చేసిందంటూ చిన్నారిని చితకబాదిన ట్యూటర్

Jul 30 2015 2:56 PM | Updated on Nov 9 2018 5:02 PM

నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థినిని ట్యూషన్ టీచర్ చితకబాదగా ఆ చిన్నారి తీవ్రంగా గాయపడిన ఘటన కర్నూలు జిల్లా కొడమూరు బాలికల బీసీ హాస్టల్‌లో గురువారం ఉదయం జరిగింది.

కొడుమూరు (కర్నూలు) : నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థినిని ట్యూషన్ టీచర్ చితకబాదగా ఆ చిన్నారి తీవ్రంగా గాయపడిన ఘటన కర్నూలు జిల్లా కొడమూరు బాలికల బీసీ హాస్టల్‌లో గురువారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తల్లిదండ్రులు పనుల కోసం వలస వెళుతూ భార్గవి అనే బాలికను స్థానిక బీసీ హాస్టల్‌లో చేర్పించారు. కాగా గురువారం ఉదయం హాస్టల్‌లో 20 రూపాయలు దొంగిలించిందనే నెపంతో ట్యూషన్ టీచర్ భాగ్య ఆ చిన్నారిని వాతలు తేలేటట్లు చితకబాదింది.

విషయం తెలుసుకున్న స్థానికులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హాస్టల్ ఎదుట ధర్నాకు దిగారు. చిన్నారిని చితకబాదిన ట్యూటర్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఆ చిన్నారి తల్లిదండ్రులు వలస వెళ్లిన ప్రాంతం నుంచి తిరిగి రావాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement