ఓ మై గాడ్‌... వెంకన్నే రక్షించాడు!

TTD withdrew  Rs13 crores before Yesbank collapse - Sakshi

కుప్పకూలిన ప్రైవేటు  బ్యాంకు యస్‌ బ్యాంకు

ఆర్‌బీఐ మారటోరియం, విత్‌ డ్రాయల్స్‌పై ఆంక్షలు

కొన్ని నెలల కిందటే రూ.1300 కోట్ల డిపాజిట్ల ఉపంసహరణ

సాక్షి, అమరావతి: టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి ముందు చూపుతో తీసుకున్న నిర్ణయంపై భక్తులు, టీటీడీ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యస్‌ బ్యాంక్‌ నుంచి కొద్ది నెలల క్రితమే రూ.1,300 కోట్ల విలువైన డిపాజిట్లను ఉపసంహరించుకొని వాటిని ప్రభుత్వరంగ బ్యాంకుల్లోకి మరలించారు. యస్‌ బ్యాంక్‌లో ఖాతాదారులు రూ.50,000 మించి తీసుకోవడానికి వీలు లేదంటూ ఆర్‌బీఐ ఆంక్షలు విధించడం తెలిసిందే. గత ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడి ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన విషయం తెలియడంతో చైర్మన్‌ ఆ మొత్తాన్ని ప్రభుత్వరంగ బ్యాంకులోకి తరలించారు. డిపాజిట్లు ఉపసంహరించుకోవద్దంటూ తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినా ఖాతరు చేయకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సీఎం ఆదేశాలతో యస్‌ బ్యాంకు నుంచి రూ.1,300 కోట్లు ఉపసంహరించుకున్నారు.

చదవండి :  విత్‌డ్రాయల్స్‌ ఆంక్షలు, ఆర్‌బీఐ గుప్పిట్లో ‘యస్‌’!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top