నూతన సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటో తేదీ భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
భక్తులు, వీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు
అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు
సాక్షి, తిరుమల: నూతన సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటో తేదీ భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సర్వదర్శనం, కాలిబాట భక్తులు, వీఐపీ దర్శనం, సామాన్య భక్తుల కోసం వివిధ రకాల నిర్దేశిత దర్శనాలు సవ్యంగా సాగేలా ఏర్పాట్లు చేశారు. పలు సేవలను రద్దు చేశారు. ఒకటో తేదీన వీఐపీల దర్శనం వేకువజామున 2గంటల నుంచి ప్రారంభిస్తారు. అందరికీ లఘుదర్శనం మాత్రమే. ప్రతి వీఐపీ తరపున ఆరుగురిని మాత్రమే అనుమతిస్తారు.
పతిఒక్కరూ సంప్రదాయ దుస్తుల్లోనే రావాల్సి ఉం టుంది. వీఐపీలను మూడు విభాగాలుగా వివిధ మార్గాల్లో అనుమతించనున్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట భక్తులకు డిసెంబర్ 31వ తేదీ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచే దివ్యదర్శనం టికెట్లు ఇస్తారు. సర్వదర్శనం భక్తులను సాయంత్రం ఐదు గంటల నుంచి ఎంబీసీ 26 వద్దగల క్యూ నుంచి అనుమతిస్తారు. రూ. 300టికెట్లు, వృద్ధులు, వికలాం గులు, చంటి బిడ్డల తల్లిదండ్రుల దర్శనాన్ని, ఒకటి, రెండో తేదీల్లో ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు.
తక్కువ సంఖ్యలోనే వీఐపీ దర్శనం: జేఈవో
వేకువజామున 2గంటల నుంచి వీఐపీ దర్శనం ప్రారంభించి రెండు నుంచి మూడు గంటల్లో పూర్తి చేస్తామని, ఆ తర్వాత ఏకధాటిగా 21 గంటలపాటు సామాన్య భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తామని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. వీఐపీ దర్శనాల వల్ల సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
కొలువు మండపం తరలింపునకు అంగీకారం
శ్రీవారి ఆలయానికి ఆగ్నేయదిశలో ఉన్న కొలువు మండపాన్ని తరలించేందుకు టీటీడీ జీయర్లు అంగీకరించారు. ఇప్పుడున్న దానికి వందమీటర్ల దూరంలోనే దీనిని పునర్నిర్మించాలని నిర్ణయించారు. 2004 మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా ఈ మండపాన్ని తొలగించాలని నిర్ణయించినా, మండపం వెనుక ఉన్న హథీ రాంజీ మఠం నిర్వాహకులు స్థలం ఇచ్చేందుకు నిరాకరించడంతో పనులు ఆగిపోయాయి. ఇటీవల రూ.1.8 కోట్లతో దక్షిణ మాడ వీధి విస్తరణ పనులను చేపట్టిన టీటీడీ తమ ఆధీనంలోని కొలువు మండపాన్ని తరలించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆలయ పెద్ద జీయరు, చినజీయరు స్వాములు, అర్చకులను సంప్రదించింది. దీంతో తూర్పు దిశలో దక్షిణ మాడ వీధిలో ప్రారంభంలో ఉన్న కొలువు మండపాన్ని తరలించేందుకు జీయర్లు, అర్చకులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.