వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు | ttd makes special arrangements for vaikunta ekadasi | Sakshi
Sakshi News home page

వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు

Dec 19 2014 6:40 PM | Updated on Sep 2 2017 6:26 PM

వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు

వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు

వైకుంఠ ఏకాదశి, కొత్త సంవత్సరాలకు తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేస్తోంది.

వైకుంఠ ఏకాదశి, కొత్త సంవత్సరాలకు తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేస్తోంది. వైకుంఠ ఏకాదశి రోజు ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. వీఐపీలకు తెల్లవారుజామున ఒంటిగంట నుంచి 5గంటల వరకు దర్శనం కల్పిస్తామని టీటీడీ తెలిపింది. ఉదయం 5 గంటల తర్వాత సర్వదర్శనం ప్రారంభం అవుతుంది. సిఫార్సు లేఖలను ఆ రోజుకు పూర్తిగా రద్దు చేశారు. సర్వదర్శనంలో వెళ్లే భక్తులకు ఏటీసీ ప్రాంతంలో ప్రవేశమార్గాన్ని ఏర్పాటుచేశారు.

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో 1.35 లక్షల మంది భక్తుల దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. వీఐపీల ఒక్కరి టికెట్టుతో ముగ్గురు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి తిరుమలకు వచ్చే భక్తుల కోసం అదనంగా 2 లక్షల లడ్డూలను సిద్ధం చేయిస్తున్నారు. ద్వాదశి నాటి కోసం 12 వేల ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఈనెల  24వ తేదీ నుంచి భక్తులకు అందుబాటులో ఉంచుతామని టీటీడీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement