ప్రశాంతంగా టెట్ | TRT Examinations Calm | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా టెట్

Mar 17 2014 1:59 AM | Updated on Sep 2 2017 4:47 AM

జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు సంబంధించిన రెండు పే పర్లకు కలిపి

 విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు సంబంధించిన రెండు పే పర్లకు కలిపి 90.5 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం 11 కేంద్రాల్లో జరిగిన పేపర్-1 పరీక్షకు 2,815 మందికిగాను 93.9 శాతంతో 2,645 మంది హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం 52 కేంద్రాల్లో జరిగిన పేపర్-2 పరీక్షకు 11,239 మందిలో 87 శాతంతో 9,783 మంది మాత్రమే హాజరయ్యారని డీఈఓ జి.కృష్ణా రావు ‘న్యూస్‌లైన్’కి తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement