పట్టిసీమ ఎత్తిపోతల వద్ద అగ్నిప్రమాదం

Transformer catch fire In Pattiseema Lift Irrigation Project - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎత్తిపోతల పథకానికి కరెంటు సప్లై చెయ్యడానికి మూడు ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. ఒక్కొక్క ట్రాన్స్‌ఫార్మర్‌ కెపాసిటీ 220 కె.వి ఉండగా అందులో ఒకటవ నెంబర్  ట్రాన్స్‌ఫార్మర్‌ అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న పోలవరం ఎస్ ఐ ఆర్ శ్రీను సంఘటనా స్థలానికి చేరుకుని సబ్ స్టేషన్ వద్ద ఉన్న వాటర్ ట్యాంకర్ల ద్వారా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 

అగ్నిమాపక కేంద్రం కొవ్వూరులో ఉండడంతో అగ్నిమాపక ఆలస్యం కావడంతో వాహనం రావడం ట్రాన్స్‌ఫార్మర్‌ పూర్తిగా దగ్ధమైంది. సబ్‌స్టేషన్‌లో మూడు ట్రాన్స్‌ఫార్మర్‌లు ఉండగా ఎన్ని అగ్ని ప్రమాదానికి గురి అయ్యాయి అన్నది ఇంకా నిర్ధారించ లేకపోతున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుండి నీటి విడుదలను గత 15 రోజుల నుండి ఆపివేయడంతో మోటార్లు జరగడం లేదు.  అయితే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top