నీళ్లపై రామోజీ విషం | Sakshi
Sakshi News home page

నీళ్లపై రామోజీ విషం

Published Mon, Aug 14 2023 5:38 AM

Eenadu Ramoji Rao Fake News On Water Projects - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రారంభించారు కాబట్టి అందులో ఎంత అవినీతి జరిగినా పట్టించుకోకూడదు!! గత సర్కారు హయాంలో కమీషన్లు కాజే­సినా సరే అది నిరాటంకంగా సాగిపోవా­ల్సిందే!! అవసరం ఉన్నా లేకున్నా అమలై తీరాల్సిందే!! ఇదీ రామోజీ తీరు!! అందుకు తాజా తార్కాణమే ‘పట్టిసీమ నాపై పగబట్టిందే..!’ శీర్షికతో ఈనాడు ప్రచు­­రించిన కథనం. చంద్రబాబు జేబులో డబ్బులతోనే టీడీపీ నిధులతోనే పట్టిసీమ ఎత్తిపోతలను నిర్మించినట్లుగా చిత్రీక­రిస్తూ బురద చల్లేందుకు యత్నించారు.

పట్టి­సీమ ఎత్తిపోతల్లో బోనస్‌ రూపంలో రూ.257.55 కోట్లు, కమీషన్ల రూపంలో మరో రూ.200 కోట్లకుపైగా టీడీపీ పెద్దల జేబులోకి వెళ్లిన విషయాన్ని కప్పిపుచ్చేందుకు రామోజీ శతవిధాలా ప్రయత్నించారు. అవస­ర­మైన­ప్పుడు పట్టిసీమ ఎత్తిపోతలను ప్రభుత్వం ఉపయో­గించుకుంటుందిగానీ గోదావరి నీళ్లను ప్రకాశం బ్యా­రే­­జ్‌లోకి ఎత్తిపోసి సముద్రంలోకి వది­లేసేందుకు కాద­నే విషయాన్ని ఇకనైనా రామోజీ గుర్తిస్తే మంచిది!!

ఈనాడు ఆరోపణ: పట్టిసీమను ఇన్నాళ్లూ పక్కనపెట్టినా ఇప్పుడు అదే దిక్కు అయింది
వాస్తవం: సాధారణంగా కృష్ణా, గోదావరికి ఒకేసారి వరదలు వస్తాయి. గత నాలుగేళ్లుగా జూలై నుంచే కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో కృష్ణా డెల్టాకు సమృద్ధిగా నీటిని విడుదల చేస్తూ ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 2019లో 797, 2020లో 1278, 2021లో 501, 2022లో 1331 టీఎంసీల మిగులు జలాలను సముద్రంలోకి వదిలేశారు.

పట్టిసీమను గత నాలుగేళ్లలో పెద్దగా ఉపయోగించుకోవాల్సిన అవసరం లేకపోయింది. కమీషన్ల కోసం చంద్రబాబు రూ.1,621.72 కోట్లు పోసి కట్టిన పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను  ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసి సముద్రం పాలు చేయలేదనే రీతిలో రామోజీ అక్కసు వెళ్లగక్కారు. 

ఆరోపణ: గోదావరి నీళ్లన్నీ సముద్రం పాలవుతున్నా పట్టిసీమ ద్వారా తరలించకుండా చోద్యం చూశారు
వాస్తవం: పులిచింతలలో నిల్వ చేసిన నీటితో­పాటు పట్టిసీమ నుంచి అవసరమైన మేరకు నీటిని ఎత్తిపోస్తూ కృష్ణా డెల్టాకు సమర్థంగా నీళ్లందించేలా ప్రభుత్వం ప్రణాళిక రచించింది. దాని ప్రకారమే నీటిని సరఫరా చేస్తోంది. ఈ సీజన్‌ ఆరంభంలో పులిచింతలలో 38 టీఎంసీల నిల్వ ఉంది.

గోదా­వరిలో వరద రానంతవరకూ కృష్ణా డెల్టా అవస­రాల కోసం పులిచింతల నుంచి 18 టీఎంసీలను ప్రభుత్వం విడుదల చేసింది. పులిచింతలలో నీటి నిల్వలు తగ్గుతున్న క్రమంలో గోదావరికి వరద రావడంతో పట్టిసీమ పంపులను జూలై 21న ప్రారంభించి ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా డె ల్టాకు నీళ్లందించింది.

ప్రభుత్వం దూరదృష్టితో రూపొందించిన ప్రణాళికను అమలు చేయడం వల్లే పులిచింతలలో వినియోగించుకున్న మేరకు 19 టీ ఎంసీలను తిరిగి నిల్వ చేయగలిగింది.  అదే పులి చింతలలో నీటిని ముందుగా కృష్ణా డెల్టాకు విడుదల చేయకుంటే మూసీ నుంచి వచ్చిన వరద సముద్రం పాలయ్యేది.

పులిచింతలకు దిగువన మున్నేరు, కట్టలేరు, పాలేరులో వరద తగ్గాక మళ్లీ పట్టి సీమ పంపులను ప్రారంభించి గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజ్‌కు తరలిస్తున్నారు. ఇప్పటివరకూ పట్టిసీమ ద్వారా 3.14 టీఎంసీలను కృష్ణా డెల్టాకు ప్రభుత్వం సరఫరా చేసింది. రైతుల ప్రయోజనాల పరిరక్షణే ఈ ప్రభుత్వానికి పరమావధి. 

ఆరోపణ: పోలవరాన్ని కుళ్లబొడిచి కోలుకోకుండా చేశారు. పట్టిసీమ మాత్రం ప్రభుత్వాన్ని వదలడం లేదు
వాస్తవం: పోలవరాన్ని కమీషన్ల కోసం సర్వ­నాశనం చేసింది చంద్రబాబే. కమీషన్ల కోసం ఆయన పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీనే చెప్పిన విషయం రామోజీకి గుర్తు లేదా? 2014 జూన్‌ 8 నుంచి 2016 డిసెంబర్‌ 30 వరకూ రెండున్నరేళ్లు చంద్రబాబు పోలవరంలో తట్టెడు మట్టి కూడా తవ్వకుండా కాలక్షేపం చేశారు. దివంగత వైఎస్సార్‌ హయాంలో చాలావరకూ పూర్తయిన పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలిస్తూ కమీషన్ల కోసం చంద్రబాబు 2015లో పట్టిసీమ ఎత్తిపోతల చేపట్టారు.

21.99 శాతం అధిక ధరలకు (ఏడాదిలోపు పూర్తి చేస్తే 16.99 శాతం బోనస్‌ ఇచ్చే నిబంధనతో) కాంట్రాక్టర్లకు ఇచ్చేశారు. గడువులోగా అన్ని పనులు పూర్తి కాకున్నా రూ.257.55 కోట్లను బోనస్‌గా ఇ చ్చేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు. పట్టిసీమ ఎ త్తిపోతల్లో భారీ కుంభకోణం జరిగిందని కాగ్‌ తేల్చి చెప్పడమే అందుకు తార్కాణం.

ఈలోగా పోలవ రం నిర్మాణ బాధ్యతలు దక్కించుకుని 2018 నాటి కే పూర్తి చేస్తామని అసెంబ్లీలో బాబు శపథం చేశారు. జీవనాడిని జాప్యం చేస్తూ రూ.1,930 కోట్ల తో పురుషోత్త­పట్నం ఎత్తిపోతలను చేపట్టారు. ప ర్యా వరణ అనుమతి లేకుండా చేపట్టడం వల్ల పురు షోత్త పట్నం ఎత్తిపోతలపై రూ. 24.90 కోట్లను పరి హా రంగా చెల్లించాలని ఎన్జీటీ ఆదేశించింది. దీంతో రూ. 1,900 కోట్లు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. 

Advertisement
Advertisement