నేడు ఉమ్మారెడ్డి అభినందన సభ | Today, the House of complimentary ummareddy | Sakshi
Sakshi News home page

నేడు ఉమ్మారెడ్డి అభినందన సభ

Jun 21 2015 12:35 AM | Updated on Jul 25 2018 4:09 PM

నేడు ఉమ్మారెడ్డి అభినందన సభ - Sakshi

నేడు ఉమ్మారెడ్డి అభినందన సభ

గుంటూరు జిల్లా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

పట్నంబజారు(గుంటూరు) : గుంటూరు జిల్లా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటలకు గుంటూరులోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో  అభినందన సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేక రుల సమావేశంలో మాట్లాడారు.

అభినందన కార్యక్రమానికి పార్టీనేతలు, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యన్నారాయణ, కొలుసు పార్ధసారధి, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, రాష్ట్ర అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, సామినేని ఉదయభానుతో పాటుగా పలు ముఖ్యనేతలు హాజరుకానున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, అన్ని విభాగాల నేతలు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికకు పోటీచేసి ఏకగ్రీవంగా ఎన్నికైన ఉమ్మారెడ్డి ని ఘనంగా సత్కరించేందుకు ప్రతిఒక్కరూ కదలి రావాలన్నారు. ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement