నేడు డయల్ యువర్ టీటీడీ ఈవో | today Dial TTD Evo | Sakshi
Sakshi News home page

నేడు డయల్ యువర్ టీటీడీ ఈవో

Jan 7 2016 11:41 PM | Updated on Aug 25 2018 7:22 PM

ప్రతినెలా మొదటి శుక్రవారం నిర్వహించే డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తారు.

సాక్షి, తిరుమల: ప్రతినెలా మొదటి శుక్రవారం నిర్వహించే డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తారు.  జనవరి ఒకటో తేదీ శుక్రవారం భక్తుల రద్దీ కారణంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. అందువల్ల రెండో శుక్రవారం(8-1-2016)న డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తిరుమలలో ఎదురయ్యే సమస్యలు, సూచనలపైభక్తులు 0877-2263261కు డయల్ చేసి టీటీడీ ఈవో డి.సాంబశివరావుకు ఫోన్ ద్వారా నేరుగా తెలియజేయవచ్చు.
 
 11గంటల నుంచి ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్
 తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరిలో జరిగే వివిధ ఆర్జిత సేవలకు సంబంధించి టికెట్ల కోటాను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఇంటెర్నెట్ ఆన్‌లైన్‌లో www. ttds-eva-online. com వెబ్‌సైట్ ద్వారా ముందస్తుగా రిజర్వు చేసుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement