ధనుర్మాసం సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం వేకువజామున 3 గంటలకు తిరుప్పావై పారాయణం చేశారు.
ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం
సాక్షి, తిరుమల: ధనుర్మాసం సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం వేకువజామున 3 గంటలకు తిరుప్పావై పారాయణం చేశారు. సూర్య సంక్రమణంతో సోమవారం ఉదయం 10.31 గంటల నుంచి ధనుర్మాసంగా పిలిచే మృగశిర మాసం ప్రారంభమైంది. ఈ నెలలో గోదాదేవి విరచిత 30 పాశురాల్లో రోజుకొకటి చొప్పున పారాయణం చేయనున్నారు. మంగళవారం నుంచే తిరుమల ఆలయంతోపాటు తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో కూడా తిరుప్పావై పారాయణం మొదలైంది.
కాగా, తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో లఘుదర్శనం అమలు చేశారు. సర్వదర్శనం కోసం 6 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నవారికి 5 గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది.