ఘరానా మోటార్‌ సైకిళ్ల దొంగ అరెస్టు | Tirupati East Police Arrested The Thief Who Stole Motor Cycles | Sakshi
Sakshi News home page

ఘరానా మోటార్‌ సైకిళ్ల దొంగ అరెస్టు

Apr 7 2019 12:12 PM | Updated on Apr 7 2019 12:12 PM

Tirupati East Police Arrested The Thief Who Stole Motor Cycles - Sakshi

స్వాధీనం చేసుకున్న బైక్‌లను చూపిస్తున్న పోలీసులు(ఇన్‌సెట్‌) పట్టుబడిన దొంగ

సాక్షి, తిరుపతి క్రైం: నగరంలో కొంతకాలంగా తాళాలు వేసిన మోటార్‌ సైకిళ్లను దొంగలిస్తున్న∙ఘరానా దొంగను ఈస్టు పోలీసులు అరెస్టు చేశారు. క్రైం ఏఎస్పీ వెంకటేశ్‌నాయక్‌ కథనం.. శుక్రవా రం మధ్యాహ్నం వాహనాలు తనిఖీ చేస్తుండగా టీఎంఆర్‌ సర్కిల్‌ వద్ద ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళుతుండగా రికార్డులు పరిశీలించారు. అయితే ఆ వాహనానికి సంబంధించి సరై న ఆధారాలు లేకపోవడంతో ఈస్టు డీఎ స్పీ నాగేశ్వరరావు, సీఐ చంద్రబాబు నా యుడు, ఎస్‌ఐ జయచంద్ర అతడిని విచా రణ చేశారు.

అతడి పేరు నరసింహులని, పీలేరుకు చెందిన అతడు పెయింటర్‌గా పనిచేస్తూ తిరుపతి ఆర్టీసీ బస్టాండు, రేణిగుంట రైల్వేస్టేషన్, పీలేరు టౌన్‌లో మోటార్‌ సైకిళ్లను దొంగలించినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఇతనిపై ఈస్టు పోలీసుస్టేషన్‌లో 11, రేణిగుంటలో ఒక కేసు, పీలేరులో 13 కేసులు ఉన్నాయి. ఇత ని నుంచి రూ.11లక్షల విలువ చేసే 24 బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇతడు హీరో హోండా మోటార్‌ సైకిళ్లనే టార్గెట్‌ చేసి చోరీలకు పాల్పడేవాడని వెల్లడైంది.  మోటార్‌ సైక్లిస్టులు ముందు చక్రానికి వీల్‌లాక్‌ వేసుకోవాలని డీఎస్పీ సూచించారు.


  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement