తిరుమలేశుని ఆభరణాల లెక్కింపు | Tirumala Srivenkeswara Swamy jewelery calculation | Sakshi
Sakshi News home page

తిరుమలేశుని ఆభరణాల లెక్కింపు

Jun 25 2017 12:27 AM | Updated on Sep 5 2017 2:22 PM

తిరుమలేశుని ఆభరణాల లెక్కింపు

తిరుమలేశుని ఆభరణాల లెక్కింపు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆభరణాలు టీటీడీ లెక్కింపు ప్రక్రియ శనివారం పూర్తి చేశారు. ప్రతియేటా రెండుమార్లు తిరుమలేశుని ఆభరణ సంపత్తిని లెక్కించటం సంప్రదాయం.

సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆభరణాలు టీటీడీ లెక్కింపు ప్రక్రియ శనివారం పూర్తి చేశారు. ప్రతియేటా రెండుమార్లు తిరుమలేశుని ఆభరణ సంపత్తిని లెక్కించటం సంప్రదాయం. ఇందులో భాగంగా మూలమూర్తి అలంకరణకు వాడే 120 రకాల ఆభరణాలు, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అలంకరణకు వాడే 350 రకాల ఆభరణాలు పరిశీలించారు.

గతంలోశ్రీవారి ఆభరణాల భద్రత విషయంలో వచ్చిన  ఆరోపణలతో టీటీడీలోని 19 తిరువాభరణాల జాబితాలోని అన్ని ఆభరణాలను డిజిటలైజేషన్‌ చేసి, ప్రత్యేకంగా ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగులు వేశారు. ఆమేరకు టీటీడీలోని  అధికారుల బృందం వారం రోజులుగా ఆలయంలోని వైకుంఠ ద్వారం ఉన్న జెమాలజీ ల్యాబ్‌లో ఆభరణాలు క్షుణ్ణంగా పరిశీలించారు.   ఆభరణాల లెక్కింపు ప్రక్రియను శనివా రం ముగించారు. జాబితా ప్రకారం అన్ని  ఉన్నట్టు తేల్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement