వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి | Three killed in separate accidents | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

Feb 19 2014 4:23 AM | Updated on Sep 2 2017 3:50 AM

మండలంలోని నిమ్మగూడెం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన పైడాకుల ప్రభాకర్(30), తిప్పల శ్రీపాల్(28) ద్విచక్రవాహనంపై బోర్లగూడెం వస్తుండగా టిప్పర్ ఢీకొంది.

మహాముత్తారం, న్యూస్‌లైన్: మండలంలోని నిమ్మగూడెం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన పైడాకుల ప్రభాకర్(30), తిప్పల శ్రీపాల్(28) ద్విచక్రవాహనంపై బోర్లగూడెం వస్తుండగా టిప్పర్ ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ ప్రభాకర్ అక్కడికక్కడే చనిపోయూడు. శ్రీపాల్‌కు తీవ్ర గాయూలయ్యూరుు. స్థానికులు అతడిని 108లో మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఎంజీఎం తీసుకెళ్లారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
 
 మేకల కోసం వెళ్లి..
 శ్రీపాల్ నిశ్చితార్థం మూడు రోజుల్లో జరగాల్సి ఉంది. దీనికోసం మేకలు కొనడానికి బోర్లగూడెం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారితోపాటు మరో బైక్‌పై ఇద్దరు వచ్చారు. నలుగురూ కలిసి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సంఘటనాస్థలాన్ని ఎస్సై అశోక్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.  
 
 ఆదిలాబాద్ జిల్లాలో...
 యైటింక్లయిన్‌కాలనీ : ఆదిలాబాద్  జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహాకవిపోతనకాలనీకి చెందిన చందుపట్ల పద్మ(45) మరణించింది. ఆమె కుమారుడు రామకృష్ణకు గాయూలయ్యూరుు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మ బంధువుల అమ్మారుు మంచిర్యాలలో ప్రసవించింది. ఆమెను చూడడానికి పద్మ తన కుమారుడు రామకృష్ణతో కలిసి మోటార్‌సైకిల్‌పై వెళ్లింది. తిరిగి వస్తుండగా ఇందారంలో కొత్తగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద టిప్పర్ వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో పద్మ అక్కడికక్కడే చనిపోరుుంది. రామకృష్ణకు గాయూలయ్యూరుు.
 
 తన కళ్లముందే తల్లి చనిపోవడం చూసి అతడు కన్నీటిపర్యంతమయ్యూడు. తన తల్లి ని కాపాడాలంటూ ప్రయాణికులను వేడుకోవడం కలచి వేసింది. తన తండ్రికి, బావకు ఫోన్ చేయాలంటూ వేడుకున్నాడు. పద్మ భర్త చంద్రమౌళి గోదావరిఖని ఓసీపీ-1లో విధులు నిర్వర్తిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 
 చికిత్స కోసం వచ్చి ..
 ముస్తాబాద్ : చికిత్స కోసం వచ్చిన ఓ వ్యక్తి బస్సు ఢీకొని మరణించాడు. ముస్తాబాద్ మండలం నామాపూర్‌లో మంగళవారం వేకువజామున ఈ సంఘటన జరిగింది. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం మేరకు..నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం చంద్రాన్‌పల్లి గ్రామానికి చెందిన పుర్ర రాజయ్య (55) కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నామాపూర్‌లో వైద్యం కోసం భార్య సాయవ్వ, తల్లితో కలసి సోమవారం ఇక్కడకు వచ్చాడు. రాత్రి వరకు నామాపూర్‌లోనే ఉండడం తో  ఇక్కడే పడుకున్నారు.
 
 మంగళవారం వేకువజామున  బస్టాండ్ వద్ద చలికాచుకున్న రాజయ్య టీ కోసం వెళ్తుం డగా  సిద్దిపేట నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్క డే చనిపోయూడు. భార్య, తల్లి రోదనలు మిన్నంటాయి. రాజయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement