ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జననం | Three Babies in Single Delivery Srikakulam | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జననం

Nov 14 2018 7:16 AM | Updated on Nov 14 2018 7:16 AM

Three Babies in Single Delivery Srikakulam - Sakshi

ముగ్గురు పిల్లలు, తల్లితో వైద్యులు

శ్రీకాకుళం అర్బన్‌: శ్రీకాకుళం నగరంలోని డాక్టర్‌ దానేటి శ్రీధర్‌ ఆస్పత్రిలో ఐవీఎఫ్‌ పద్ధతిలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు ఓ తల్లి జన్మనిచ్చింది. రణస్థలం మండలం నగరపాలెం గ్రామానికి చెందిన కెల్ల తాత, పుష్పవతిలకు వివాహం జరిగి 18 సంవత్సరాలైంది. అయితే సంతానం లేకపోవడంతో వారు డాక్టర్‌ దానేటి శ్రీధర్‌ని సంప్రదించారు. డాక్టర్‌ సలహా మేరకు ఐవీఎఫ్‌ పద్ధతిలో చికిత్స పొందారు. అనంతరం పుష్పవతి గర్భం దాల్చింది. సోమవారం రాత్రి ఒక మగ, ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. తల్లి, ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. డాక్టర్‌ స్వర్ణలత, చిన్నపిల్లల వైద్యనిపుణులు డాక్టర్‌ వినోద్‌కుమార్, మేనేజర్‌ కృష్ణకాంత్‌ నిరంతం పర్యవేక్షణ చేసినట్టు వైద్యుడు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement