21న ఆర్కే బీచ్లో సమైక్య గర్జన : గంటా | The Visakha Samaikya Garjana is to be held on September 21 at R K Beach | Sakshi
Sakshi News home page

21న ఆర్కే బీచ్లో సమైక్య గర్జన : గంటా

Sep 15 2013 10:38 AM | Updated on Jul 29 2019 5:31 PM

తాము మంత్రి పదవులకు చేసిన రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

తాము మంత్రి పదవులకు చేసిన రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ నెల 21న విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో నిర్వహించ తలపెట్టిన విశాఖ సమైక్య గర్జన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ... తమ రాజీనామాలు ఆమోదింప చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

 

రాష్ట విభజనపై కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని పక్షంలో సామూహిక రాజీనామాలకు సిద్ధంగా ఉన్నట్లు సాక్షాత్తూ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి వెల్లడించిన సంగతిని ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో త్వరలో సమైక్య సభ ఏర్పాటు చేసే ఉద్దేశం తమకు ఉన్నట్లు గంటా ఈ సందర్భంగా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement