గుర్రంకొండ కోటలో గొయ్యి | the pit in the Gurrankonda castle | Sakshi
Sakshi News home page

గుర్రంకొండ కోటలో గొయ్యి

Dec 2 2015 11:49 AM | Updated on Sep 3 2017 1:23 PM

చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండల కేంద్రంలోని చారిత్రక కోటలో భూమి కుంగి.. సొరంగ మార్గం భయట పడింది.

చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండల కేంద్రంలోని చారిత్రక కోటలో భూమి కుంగి.. సొరంగ మార్గం భయట పడింది. వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా.. కోటలోని ఓ ప్రాంతంలో బుధవారం ఒక్కసారిగా భూమి కుంగిపోయింది. దీంతో 30 అడుగుల లోతు పది అడుగుల వెడల్పు ఉన్న పెద్ద గుంట ఏర్పడింది. కోటలోని ఈద్గా సమీపంలో ఏర్పడిన ఈ గుంత కింద సొరంగ మార్గం ఉందని స్థానికులు అంటున్నారు. సొరంగం ఉండటంతోనే భూమి ఒక్కసారిగా కుంగిపోయిందని చెబుతున్నారు. పురాతత్వ శాఖకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement