రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి (జేఏసీ)లో చీలిక అనివార్యంగా కనిపిస్తోంది.
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి (జేఏసీ)లో చీలిక అనివార్యంగా కనిపిస్తోంది. నూతన జేఏసీ ఆవిర్భావానికి రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం జేఏసీకి నేతృత్వం వహిస్తున్న అశోక్‌బాబుపై తిరుగుబాటు బావుటా ఎగరేసేందుకు 30 ఉద్యోగ సంఘాలు ఏకమవుతున్నాయి. ఏపీఏన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడిగా అశోక్‌బాబు రాష్ట్ర ప్రభుత్వానికి సాగిలపడి వ్యవహరిస్తున్నారని, ఉద్యోగుల సమ స్యలు పట్టించుకోవడం లేదని సంఘాల నేతలు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యం లోనే 5న తిరుపతిలో సమావేశం కావాలని ఆయా సంఘాలు నిర్ణయించినట్టు సమాచారం. నవనిర్మాణ సదస్సు పేరిట తిరు పతి రెవెన్యూ అసోసియేషన్ హాలులో ఈ భేటీ జరగనుంది. కొత్త జేఏసీ విధివిధా నాల రూపకల్పన తదితర అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.