మాదిగలను మోసం చేసిన బాబు | the Manjunath Commission tour to obstruct | Sakshi
Sakshi News home page

మాదిగలను మోసం చేసిన బాబు

Feb 21 2016 4:35 AM | Updated on Oct 9 2018 4:20 PM

మాదిగలను మోసం చేసిన బాబు - Sakshi

మాదిగలను మోసం చేసిన బాబు

ఎన్నికల సమయంలో మాదిగల చిహ్నమైన డప్పు కొట్టి తాను పెద్ద మాదిగనవుతానని చెప్పి తీరా గద్దెనెక్కాక మాదిగలను మోసం.....

మంజునాథ్ కమిషన్ పర్యటనను అడ్డుకుంటాం
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు


గుత్తి:  ఎన్నికల సమయంలో మాదిగల చిహ్నమైన డప్పు కొట్టి తాను పెద్ద మాదిగనవుతానని చెప్పి తీరా గద్దెనెక్కాక మాదిగలను మోసం చేసి చంద్రబాబు  రాష్ట్రంలోనే పెద్ద మోసగాడని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు విమర్శించారు. పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద శనివారం సాయంత్రం మాదిగల సమరభేరి బహిరంగ సభను నిర్వహించారు. అంతకు ముందు మన్రోసత్రం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా వచ్చి  రాయలసీమ జిల్లాల ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఎంఎస్ రాజు మాట్లాడుతూ ఆర్థిక, రాజకీయ, సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉన్న కాపులకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి ఎస్సీ వర్గీకరణ ఎందుకు గుర్తుకులేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మంజునాథ్ కమిషన్‌ను అడ్డుకుంటామన్నారు. కాపులు ఒక రైలు కాలిస్తేనే కాపు కార్పొరేషన్‌కు చంద్రబాబు వెయ్యి కోట్లు కేటాయించారన్నారు.

100 రైళ్లు కాల్చే సత్తా మాదిగలకు ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీలపట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబును గద్దెదించే సత్తా మాల,మాదిగలకు ఉందన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి కుంటి మద్ది ఓబులేసు, రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు రమణ, జిల్లా అధ్యక్షడు కణేకల్ క్రిష్ణ, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు బొంగ సంజయ్, ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నె చిరంజీవి, రాష్ట్ర నాయకులు కెరటాల మల్లేష్, జిల్లా అధికార ప్రతినిధి తిరుపాల్, జిల్లా ఉపాధ్యక్షుడు నగేష్, గుత్తి మండల,పట్టణ అధ్యక్షులు అంజన్ ప్రసాద్, సుధాకర్, టౌన్ కార్యదర్శి మధుబాబు,గౌరవాధ్యక్షుడు ఎల్లప్ప, పట్టణ ఉపాధ్యక్షుడు రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement