విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి | The lifting of Illegal cases of student leaders | Sakshi
Sakshi News home page

విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

Mar 24 2016 3:49 AM | Updated on May 25 2018 9:20 PM

విద్యార్థి నాయకులపై   అక్రమ కేసులు ఎత్తివేయాలి - Sakshi

విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

ఎస్కేయూలో విద్యార్థుల సమస్యలపై ఆందోళన చేసిన విద్యార్థి సంఘాల నాయకులపై బనాయించిన ...

వైఎస్సార్ విద్యార్థి విభాగం డిమాండ్

అనంతపురం ఎడ్యుకేషన్: ఎస్కేయూలో విద్యార్థుల సమస్యలపై ఆందోళన చేసిన విద్యార్థి సంఘాల నాయకులపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి మాట్లాడుతూ ఎస్కేయూ విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతి కల్పించాలని, మరోవైపు అధిక మెస్ బిల్లులు వస్తుండడంపై వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు వీసీ, రిజిస్ట్రార్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారన్నారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సెంట్రల్ ఆఫీస్ స్టోర్ వద్ద ధర్నా చేస్తే విద్యార్థి సంఘం నాయకులపై అక్రమ కేసులు బనాయించారన్నారు. యూనివర్సిటీలో వీసీ పాలన కాకుండా పోలీసు పాలన జరుగుతోందన్నారు. సమస్యలపై ఏ చిన్న ధర్నా చేసినా పోలీసులకు ఫిర్యాదు చేసి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా అక్రమ కేసులు, అక్రమ దాడులు చేస్తే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులు సుధీర్‌రెడ్డి, బాబాసలాం, నగర కార్యదర్శులు పూర్ణచంద్ర, సురేష్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement