ఖర్చుకూ కాలయాపనే | The first phase of the use of funds | Sakshi
Sakshi News home page

ఖర్చుకూ కాలయాపనే

Sep 30 2015 4:18 AM | Updated on Jun 4 2019 5:04 PM

ఖర్చుకూ కాలయాపనే - Sakshi

ఖర్చుకూ కాలయాపనే

ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద ఇచ్చింది కొసరంతా..ఆ కాస్త నిధులను కూడా ఖర్చు చేసేందు కు జిల్లా యంత్రాంగం ఆర్నెల్లుగా కాల యాపన చేసింది

వినియోగించని తొలివిడత నిధులు
మళ్లీ జిల్లాకు రూ.50 కోట్లు విడుదల
{పతిపాదనల దశ దాటని పనులు
ఇదీ ‘ప్రత్యేక’ ప్యాకేజి నిధుల సంగతి
 
 సాక్షి, విశాఖపట్నం : ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద ఇచ్చింది కొసరంతా..ఆ కాస్త నిధులను కూడా ఖర్చు చేసేందు కు జిల్లా యంత్రాంగం ఆర్నెల్లుగా కాల యాపన చేసింది. ఇప్పుడు మరో విడత నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ఈ ని దుల వినియోగంపై దృష్టి పెట్టాల్సిన అ వసరం ఉంది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసమంటూ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద జిల్లాకు రూ.50కోట్ల చొప్పున 2014-15 ఆర్ధిక సంవత్సరానికి రూ.350కోట్లు మంజూరు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.50కోట్లు విడుదల య్యాయి.

 ఆలస్యంగా కమిటీ సమావేశం
 మరుసటి నెలలోనే ఈ నిధుల వినియోగంపై ప్ర త్యేక మార్గదర్శకాలు జారీఅ య్యాయి. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ ప్రతీ నెలా సమావేశమవుతూ నిధుల విని యోగంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. కానీ పట్టించుకున్న పాపానపోలేదు. సాక్షిలో ఇటీవల ప్రచురితమై న కధనంపై స్పందించిన కలెక్టర్ యువరాజ్  రెండ్రోజుల క్రితం తొలి మోనటరింగ్ కమిటీ సమావేశం ఏ ర్పాటు చేశారు. ఇప్పటి వరకు శా ఖల అందిన ప్రతిపాదనలను పరిశీలించి న కలెక్టర్ యువరాజ్ కొన్నింటికి పరిపాలనా మోదమిచ్చారు.

 ఇవీ ప్రతిపాదనలు
 ప్రతిపాదనల్లో ఫిషరీస్ నుంచి రూ. 3.75 కోట్లు, పశు సంవర్ధక శాఖ నుంచి రూ.21.12 కోట్లు, డ్వామా నుంచి రూ.7.25 కోట్లు, వ్యవసాయ శాఖ నుం చి రూ.10.50కోట్లు, విద్యా శాఖ నుంచి రూ.1.93 కోట్ల పనులకు పాలనామోదం ఇచ్చారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో 100 సోలార్ పంపుసెట్లు, బోర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తే ఆమోదిస్తానని కలెక్టర్ ప్రకటించారు. దీంతో పాడేరు ఐటీడీఎ నుంచి వచ్చిన రూ.11కోట్ల ప్రతిపాదనలతో పాటు అటవీశాఖ-రూ.2.10 కోట్లు, డీఐసీ-రూ.25లక్షలు, ఏపీ టీడీసీ-రూ.3.10 కోట్లు, సీపీఒ-రూ.50లక్షలు, బీసీ కార్పొ రేషన్ రూ.1.83కోట్లకు ఇంకాఅనుమతులివ్వాల్సి ఉంది.

 మళ్లీ వచ్చిపడ్డాయి:
 ఈ నిధులు వినియోగం ఇంకా పూర్తిగాగాడిలో పడకముందే 2015-16 ఆర్ధిక సం వత్సరానికి సంబంధించి మరో రూ.50కోట్లు జిల్లాకు విడుదలయ్యాయి. ఈ నిధు లు ప్రస్తుతం సీపీఒ వ్యక్తిగత ఖాతా (పీడీ)లో ఉన్నాయి. వీటిని పూర్తిగా కరువు నివారణా చర్యలు, నైపుణ్యాభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాలకు ఖర్చు చేయాల్సి ఉంది. పనులు నిర్వహించే ఏజెన్సీకి జిల్లాకలెక్టర్ అనుమతితోనే చెల్లింపులు చేయాలి. ఖర్చుచేసిన ప్రతీరూపాయికి ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలి.

ఎప్పటికప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ సమర్పించాలి. జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ నెలకు కనీసం ఒకసారైనా విధిగా సమావేశమై సమీక్షించుకోవాల్సి ఉంది.గత ఆర్ధిక సంవత్సరంలో మంజూరైన నిధులు వినియోగంపై ఇప్పుడు కసరత్తు మొదలుపెట్టిన యంత్రాంగం ప్రస్తుతం మంజూరైన నిధులను ఖర్చుచేసేందుకు ఇంకెంత సమయం తీసుకుంటుందోననే సందే హాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement