రేపు ముఖ్యమంత్రి జిల్లా పర్యటన | The Chief Minister's visit tomorrow | Sakshi
Sakshi News home page

రేపు ముఖ్యమంత్రి జిల్లా పర్యటన

Nov 23 2013 2:01 AM | Updated on Sep 2 2017 12:52 AM

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో ఆదివారం పర్యటించనున్నట్లు కలెక్టర్ రాంగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

చిత్తూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో ఆదివారం పర్యటించనున్నట్లు కలెక్టర్ రాంగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి ఆది వారం మధ్యాహ్నం 1 గంటకు అనంతపురం జిల్లా నుంచి బయలుదేరి 2.30 గంటలకు వి.కోటకు చేరుకుంటారు. వి.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.

మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండలో పాల్గొంటారు. సాయంత్రం 4.40 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4.50 గంటలకు హెలిప్యాడ్ చేరుకుంటారు. 5 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 5.30 గంటలకు కలికిరి చేరుకుంటారు. తర్వాత 5.40 గంటలకు పీలేరు ప్రాంత అభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 6.10 గంటలకు స్వగ్రామం నగిరిపల్లెకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

సోమవారం ఉదయం 10 గంటలకు కలికిరి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి వైఎస్‌ఆర్ జిల్లా రాయచోటికి చేరుకుంటారు. అక్కడ రచ్చబండ సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు రేణిగుంటకు చేరుకుని భోజన విరామానంతరం 2.30 గంటలకు రాష్ర్ట రాజధాని హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
 

Advertisement
 
Advertisement
Advertisement