బెజవాడలో ‘బి న్యూ’ | The beginning of the smart mobile stores | Sakshi
Sakshi News home page

బెజవాడలో ‘బి న్యూ’

Sep 20 2014 1:29 AM | Updated on Sep 2 2017 1:39 PM

బెజవాడలో ‘బి  న్యూ’

బెజవాడలో ‘బి న్యూ’

మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక మోడల్స్‌తో కూడిన మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా నగరంలో రెండు ‘బి న్యూ’ స్మార్ట్ మొబైల్ స్టోర్లను శుక్రవారం ప్రారంభించారు.

  • రెండు స్మార్ట్ మొబైల్ స్టోర్లు ప్రారంభం
  •  ప్రారంభోత్సవంలో ‘పవర్’ ఫేమ్ రెజీనా హల్‌చల్
  • విజయవాడ : మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక మోడల్స్‌తో కూడిన మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా నగరంలో రెండు ‘బి న్యూ’ స్మార్ట్ మొబైల్ స్టోర్లను శుక్రవారం ప్రారంభించారు. బెంజిసర్కిల్ సమీపంలోని మహాత్మాగాంధీరోడ్డులో, ఏలూరురోడ్డులోని రామ మందిరం ఎదురుగా ఏర్పాటుచేసిన ఈ స్టోర్స్‌ను ‘పవర్’ సినిమా ఫేమ్ రెజీనా కసాండ్రా లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బి న్యూ స్టోర్స్‌లో షాపింగ్ సరికొత్త అనుభూతిని ఇస్తుందన్నారు.

    ముఖ్యంగా యువత అత్యాధునిక టెక్నాలజీ కలిగిన స్మార్ట్ ఫోన్‌లపై ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. వారి అభిరుచులకు అనుగుణంగా మొబైల్స్ అందించేందుకు స్టోర్స్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. బి న్యూ స్టోర్స్ సీఎండీ వైడీ బాలాజీ చౌదరి మాట్లాడుతూ తాము నెల్లూరులో నాలుగు మొబైల్ షాపులను రెండు దశాబ్దాలుగా నిర్వహించడంతో పాటు మూడేళ్లుగా సోనీ, మైక్రోమ్యాక్స్, కార్బన్, ఇంటెక్స్, హెచ్‌టీసీ వంటి మల్టీ నేషనల్ కంపెనీలకు డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.

    నేడు ఆంధ్రప్రదేశ్‌లో బి న్యూ పేరుతో మొబైల్ స్టోర్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నగరంలో రెండు స్టోర్‌లు ప్రారంభించామని, వాటిలో రూ.600 నుంచి రూ.60 వేల విలువ కలిగిన ఫోన్ల వరకు అందుబాటులో ఉంటాయన్నారు. సరికొత్త మోడల్ ఫోన్లు కొనుగోలు చేసినప్పుడు కస్టమర్లకు కంపెనీకి చెందిన డిమాన్‌స్ట్రేటర్ దాని పనితీరును వివరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
     
    రెజీనా సందడి


    బి న్యూ స్టోర్స్ ప్రారంభోత్సవానికి వచ్చిన రెజీనా నగరంలో హల్‌చల్ చేశారు. ఆమెను చూసేందుకు షోరూమ్‌ల వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు, యువకులు చేరుకోవడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. ఆమె అభిమానులకు అభివాదం చేయడంతో యువకులు కేరింతలు కొట్టారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement