పదికి పక్కా ఏర్పాట్లు | Tenth exams strict arrangements | Sakshi
Sakshi News home page

పదికి పక్కా ఏర్పాట్లు

Mar 26 2014 2:11 AM | Updated on Aug 21 2018 9:20 PM

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అ న్ని పోలీస్ స్టేషన్లలోనూ పదో తరగతి పరీక్షా పేపర్లు సిద్ధంగా ఉన్నా యి.

వైవీయూ, న్యూస్‌లైన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అ న్ని పోలీస్ స్టేషన్లలోనూ పదో తరగతి పరీక్షా పేపర్లు సిద్ధంగా ఉన్నా యి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను విద్యాశాఖ చేసింది.  జిల్లా వ్యాప్తంగా మొత్తం 33,232 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో అమ్మాయిలు 16,223 మంది, అబ్బాయిలు 17,009 మంది ఉన్నారు.
 
 వీరితో పాటు 1769 మంది అభ్యర్థులు ప్రైవేటుగా పరీక్షలకు హాజరవుతారు. 292 మంది అంధులు, వైకల్యం ఉన్న అభ్యర్థులకు సహాయకులను ఏర్పా టు చేశారు. రెగ్యులర్ విద్యార్థుల కోసం 145, ప్రైవేటు అభ్యర్థుల కోసం 11 కేంద్రాలను ఏర్పాటు చేశా రు. పరీక్షలను పరిశీలించేందుకు రెవె న్యూ, విద్యా, పోలీస్ శాఖలతో కూడి న పది బందాలను ఏర్పాటు చేసింది.  పరీక్షల సమయంలో విద్యుత్ కోత లేకుండా ట్రాన్స్‌కో అధికారులతో  చర్చించారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ప్రత్యేక బస్సులు నడపాలని కోరారు.  
 
 ప్రత్యేక జాగ్రత్తలు
 విద్యార్థులు వడదెబ్బకు గురి కాకుండా ఉండేందుకు  పరీక్ష కేంద్రా ల్లో ఓఆర్‌ఎస్ పాకెట్లను అందుబాటు లో ఉంచారు.  ఏఎన్‌ఎంలను నియమించేలా చర్యలు తీసుకున్నారు.
 
 ఫలితాల కోసం ప్రత్యేక కసరత్తు
 గత విద్యా సంవత్సరం రాష్ట్ర స్థాయి లో మూడో స్థానంలో, అంతకు ముం దు సంవత్సరం రెండో స్థానంలో నిలిచిన జిల్లాను ఈసారి మొదటి స్థానంలో తెచ్చేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. కనీసం ఉన్న స్థానాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా రు. సమైక్యాంధ్ర ఉద్యమంతో విద్యాబోధన జరగక్క, విద్యార్థులు తమ విలువైన సమయాన్ని కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. అయినా కలెక్టర్ కోన శశిధర్  ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వచ్చారు.
 
 పరీక్షల నిర్వహణపై డీఈఓ సమీక్ష
 వైవీయూ, న్యూస్‌లైన్: పదో తరగతి పరీక్షలపై డీఈఓ సమీక్షించారు. కడపలోని జిల్లా విద్యాశాఖ కార్యాల యంలో గల తన చాంబర్‌లో స్వ్కాడ్ బృందాలు, రూట్ ఆఫీసర్లతో మంగళవారం సమీక్షించారు. ఏర్పాట్లపై చర్చించారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేం ద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. పరీక్షల రాష్ట్ర పరిశీలకురాలు గీత మాట్లాడారు.  చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు ఆమె పలు సలహా, సూచనలు ఇచ్చారు.   
 
 పరీక్ష కేంద్రాల వద్ద నిషేదాజ్ఞలు
 కడప అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు పూర్తయ్యేంత వరకు నిషేదాజ్ఞలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. పరీక్షలకు విఘాతం కలిగించే వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement