నాన్నా.. నేను.. టెన్త్‌ పాస్‌! | Father and Son pass the 10th class exam at the same ... | Sakshi
Sakshi News home page

నాన్నా.. నేను.. టెన్త్‌ పాస్‌!

Jun 8 2025 10:18 AM | Updated on Jun 8 2025 10:18 AM

Father and Son pass the 10th class exam at the same ...

కొండపాక(గజ్వేల్‌): వాళ్లిద్దరూ తండ్రీకొడుకులు.. ఒకే ఏడాది పదో తరగతి పరీక్ష రాసి.. ఒకేసారి ఇద్దరూ ఉత్తీర్ణులయ్యారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం గిరాయిపల్లి గ్రామానికి చెందిన ముక్కెర బాల్‌నర్సు (38) వ్యవసాయంతో పాటు.. సిర్సనగండ్ల హైస్కూ ల్లో మధ్యాహ్న భోజనం కార్మికునిగా పని చేస్తు న్నాడు. 

ఓపెన్‌ యూనివర్సిటీ విద్య నభ్యసి స్తూ.. 10వ తరగతి పరీక్ష రాసి 248 మార్కు లతో ఉత్తీర్ణుడయ్యాడు. కుమారుడు ప్రదీప్‌ కూడా సిర్సనగండ్ల గ్రామ హైస్కూల్లో చదువు కుంటూ.. 10వ తరగతి పరీక్షల్లో 444 మార్కు లు సాధించాడు. తండ్రీ కొడుకు ఒకే సంవత్స రంలో.. 10వ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా తండ్రీకొడుకు లిద్దరినీ స్థానికులు అభినందించారు.    

Advertisement
 
Advertisement
Advertisement