ప్రకాశం జిల్లా రామతీర్థం జలాశయం వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది.
ఒంగోలు : ప్రకాశం జిల్లా రామతీర్థం జలాశయం వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. నీటి విడుదల సందర్భంగా రామతీర్థం రిజర్వాయర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు...వారిని అడ్డగించటంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదికాస్తా ఘర్షణకు దారి తీసింది.