చిత్తూరు జిల్లా పుత్తూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో పుత్తూరు మేదర వీధిలోని ఓ నివాసంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి పోలీసుల సోదాలు కొనసాగిస్తున్నారు.
చిత్తూరు : చిత్తూరు జిల్లా పుత్తూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో పుత్తూరు మేదర వీధిలోని ఓ నివాసంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి పోలీసుల సోదాలు కొనసాగిస్తున్నారు. ఉగ్రవాదుల దాడిలో ఇన్స్పెక్టర్తో పాటు ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా సోదాలను పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు.
కాగా సోదాల్లో గాయపడ్డ సీఐ కళ్యాణ్ను చికిత్స నిమిత్తం చెన్నైకి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొద్ది నెలల క్రితం నలుగురు వ్యక్తులు బీడీ కార్మికలుగా ఇంటిని అద్దెను తీసుకున్నట్లు సమచారం. అయితే వారు రాత్రి సమయంలోనే ఇంట్లో ఉండేవారని, వారి గురించి పూర్తి వివరాలు తెలియవని చెబుతున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించటంతో స్థానికులు ...ఏం జరుగుతుందో అని భయాందోళనలకు గురి అవుతున్నారు.
కొంతమంది స్థానికులు తమ నివాసాలకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై మాట్లాడేందుకు వారు నిరాకరిస్తున్నారు. మరోవైపు దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం కాబట్టి మీడియా సహకరించాలని.... పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి ఓ అంబులెన్స్ చేరుకోవటంతో ఏం జరిగిందా అనే ఉత్కంఠ నెలకొంది.