విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఉద్రిక్తత

Tense Between Patient Relatives And Doctors In Vijayawada Govt Hospital - Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో పేషంట్‌ బంధువులు, డాక్టర్ల మధ్య గొడవ చెలరేగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైద్యం అందడం లేదని పేషంట్‌ తరపు బంధువులు డాక్టర్లను ప్రశ్నించడంతో వివాదం మొదలైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పేషంట్‌ బంధువులు తమపై దాడి చేస్తున్నారని డ్యూటీ డాక్టర్లు సమాచారం ఇవ్వడంతో హాస్టల్‌లో ఉంటున్న మెడికల్‌ కాలేజీ విద్యార్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.దీంతో వివాదం మరింత ముదిరింది.

మెడికల్‌ కాలేజీ విద్యార్థులతో కలిసి డ్యూటీ డాక్టర్లు రోగి బంధువులపై దాడికి దిగారు. అంతేకాకుండా.. తమపైనే దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఇక పేషంట్‌ బంధువులు కూడా పోలీసులను కలిశారు. ట్రీట్‌మెంట్‌ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించినందుకు తమపై డ్యూటీ డాక్టర్లు, మెడికల్‌ కాలేజీ విద్యార్థులు దాడికి దిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యాక్సిడెంట్‌లో గాయాలపాలైన వ్యక్తికి వైద్యం అందించడంలో ఆలస్యం చేశారని ఆరోపించారు. ఇరు వర్గాల ఫిర్యాదుల్ని స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌​ అయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top