పలు ప్రాంతాల్లో టీడీపీ యదేచ్చగా కోడ్ ఉల్లంఘన! | TDP voilating the Election code in Seemandhra Region | Sakshi
Sakshi News home page

పలు ప్రాంతాల్లో టీడీపీ యదేచ్చగా కోడ్ ఉల్లంఘన!

May 6 2014 5:04 PM | Updated on Aug 14 2018 4:32 PM

పలు ప్రాంతాల్లో టీడీపీ యదేచ్చగా కోడ్ ఉల్లంఘన! - Sakshi

పలు ప్రాంతాల్లో టీడీపీ యదేచ్చగా కోడ్ ఉల్లంఘన!

ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఎలాంటి ప్రచారం చేపట్టవద్దని ఎన్నికల సంఘం నిర్ధేశించిన నియమ, నిబంధనల్ని(కోడ్) తెలుగుదేశం పార్టీ యదేచ్చగా ఉల్లంఘనకు పాల్పడుతోంది

కాకినాడ: ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఎలాంటి ప్రచారం చేపట్టవద్దని ఎన్నికల సంఘం నిర్ధేశించిన నియమ, నిబంధనల్ని(కోడ్) తెలుగుదేశం పార్టీ యదేచ్చగా ఉల్లంఘనకు పాల్పడుతోంది. సీమాంధ్రలోని పలు ప్రదేశాల్లో టీడీపీ మద్యం, డబ్బు పంచుతూ.. ప్రచారానికి పాల్పడుతోంది. 
 
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో ఎన్నికల నిబంధనల్ని బేఖాతరు చేసి టీడీపీ నేత బాలవీరాంజనేయస్వామి ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే అధికారులు పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. 
 
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో టీడీపీ నేతల ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతున్నారు. దుమ్మలపేట, తారకరామనగర్‌లలో టీడీపీ పోస్టర్లతో  ప్రచారం నిర్వహిస్తున్నారు.  టీడీపీ ఎంపీ అభ్యర్థి తోట నర్సింహం, ఎమ్మెల్యే అభ్యర్థి కొండబాబుతో కూడిన పోస్టర్లతో ప్రచారం నిర్వహిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement