టీడీపీ పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయింది | TDP of the corruption ridden | Sakshi
Sakshi News home page

టీడీపీ పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయింది

Jun 11 2015 12:32 AM | Updated on Aug 14 2018 11:26 AM

తెలుగుదేశం పార్టీ పూర్తిగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందని జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాలే పుల్లారావు ధ్వజమెత్తారు.

జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు కాలే పుల్లారావు
 
 సత్యనారాయణపురం : తెలుగుదేశం పార్టీ పూర్తిగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందని జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాలే పుల్లారావు ధ్వజమెత్తారు. స్థానిక భగత్‌సింగ్ రోడ్డులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజీనామా చేయకుండా ఇరు రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం దారుణమన్నారు.

చంద్రబాబు వెంటనే రాజీనామా చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్  చేశారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఖర్చుల కోసమే తాను లంచం తీసుకుంటున్నానని కృష్ణాజిల్లా మాతా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఉండ్రాజవరపు జెస్సీ డైమండ్ రోజీ ఏసీబీ అధికారులకు వెల్లడించారన్నారు. మంత్రి సుజాత తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ తరపున డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి కామా దేవరాజ్ మాట్లాడుతూ చంద్రబాబులో ఏమాత్రం నీతినిజాయితీ ఉన్నా వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరి తులిమిల్లి సుందరప్రసాద్, వేము దుర్గారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement