
గాయపడిన వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు
సాక్షి, అనంతపురం : జిల్లాలోని ముదిగుబ్బ మండలం నాగిరెడ్డిపల్లిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడి చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల ప్రచారం కోసం వాల్ పెయిటింగ్స్ రాస్తున్న ఆ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేత దేవేంద్ర తన అనుచరులు దౌర్జన్యానికి దిగారు. గోడల మీద ఎందుకు రాస్తున్నారంటూ వారిపై దాడి చేశారు.
ఈ దాడిలో ముగ్గురు వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ దాడిపై వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. పోలీసు స్టేషన్ సమీపంలోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ అనచరులు రాళ్ల దాడి చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర పరిమితమయ్యారు. అంతేకాకుండా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణలపైనా పోలీసులు లాఠీచార్జి చేశారు.