రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది.
ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ డీఎస్పీపై ప్రతిపక్ష పార్టీ ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్.. ఆయన్ను బదిలీ చేసిందని పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రిపై విపక్ష నేత చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదన్నారు. సర్వేలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారని, ఇది నిబంధనలకు విరుద్ధమన్నారు. ఉప ఎన్నికపై సాక్షి దినపత్రిక, చానల్‌లో వస్తున్న కథనాలను పెయిడ్ ఆర్టికల్స్‌గా పరిగణించాలన్నారు.