శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కనుగులవలస గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తలు కత్తితో దాడి చేశారు.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కనుగులవలస గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తలు కత్తితో దాడి చేశారు. గ్రామంలో ఆదివారం సాయంత్రం వినాయక నిమజ్జనం సందర్భంగా చోటు చేసుకున్న చిన్న ఘర్షణ దాడికి కారణమైందని తెలుస్తోంది. టీడీపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు సోమవారం తెల్లవారుజామున గ్రామంలోని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్త బి.బాలాజీపై అతని ఇంటి వద్దే కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన బాలాజీని శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించారు.