శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన కూలీలకు ఒక్కొక్కరికి రూ. 3లక్షల చొప్పున నష్టపరిహారాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
	తమిళనాడు/చిత్తూరు: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన కూలీలకు ఒక్కొక్కరికి రూ. 3లక్షల చొప్పున నష్టపరిహారాన్ని తమిళనాడు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.  
	
	చిత్తూరు జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూలీల ఎన్కౌంటర్కు నిరసనగా మద్రాస్ హైకోర్టు లాయర్లు బుధవారం నిరసకు దిగారు. ఎన్కౌంటర్ పేరుతో కూలీలను కాల్చిచంపినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిరసనగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
