 
															వడదెబ్బ శుక్రవారం మృతులు 40
వడగాలుల ధాటికి పేదల ఊటీ వడలిపోతోంది. ఎండ తీక్షణత.. తీవ్రమైన ఉక్కపోతతో ఉడికిపోతోంది. శరీరంలోని శక్తి చెమట రూపంలో బయటకు వచ్చేస్తుండటంతో వృద్ధులు, పిల్లలు జావగారిపోతున్నారు.
	- వడగాడ్పులు, ఎండల తీవ్రతతో  అల్లాడుతున్న జిల్లా
	- పిట్టల్లా రాలిపోతున్న వృద్ధులు, అనాథలు, పిల్లలు
	- రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
	- తీవ్రమైన ఉక్కపోత.. ఆపై విద్యుత్ కోతలు
	- పాఠశాలలకు ఆలస్యంగా సెలవు ప్రకటించిన అధికారులు
	- రెండు రోజుల్లో 53 వడదెబ్బ మరణాలు
	వడగాలుల ధాటికి పేదల ఊటీ వడలిపోతోంది. ఎండ తీక్షణత.. తీవ్రమైన ఉక్కపోతతో ఉడికిపోతోంది. శరీరంలోని శక్తి చెమట రూపంలో బయటకు వచ్చేస్తుండటంతో వృద్ధులు, పిల్లలు జావగారిపోతున్నారు. పిట్టల్లా రాలిపోతున్నారు. గురువారం 13 మంది మరణిస్తే.. శుక్రవారం ఏకంగా 40 మంది వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. రుతుపవనాలతో చల్లగా ఉండాల్సిన వాతావరణం.. సూర్యతాపంతో నాలుగు రోజులుగా సెగలు కక్కుతోంది. దీనికితోడు వేళాపాళాలేని కరెంటు కోతలు ప్రజలను పెనం మీది నుంచి పొయ్యిలోకి తోసేస్తున్నాయి. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉండవచ్చన్న వాతావరణ శాఖ సూచనలతో జనం బెంబేలెత్తుతున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
